పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన హరిహర వీరమల్లు  సినిమా జూలై 24 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ నటించిన సినిమా చాలా కాలం తర్వాత విడుదల కానుండడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడ్డారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్లు దక్కిన ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం , పవన్ నటించిన సినిమా చాలా కాలం తర్వాత విడుదల కానుండడంతో ఈ మూవీ కి పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. దానితో ఈ మూవీ కి పెద్ద ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 127.50 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 57.40 కోట్ల షేర్ ... 85.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 12 రోజుల్లో 68.72 కోట్ల షేర్ ... 112.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

దానితో ఈ మూవీ మరో 58.76 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా అన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి క్లీన్ హీట్ గా నిలవడం కాస్త కష్టం అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టాడు అనే ఆనందకరమైన వార్తను వినాలి అంటే ఓజి సినిమా విడుదల వరకు ఆగాల్సిందే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: