కోలీవుడ్, టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ప్రస్తుతం దేశవ్యాప్తంగా హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమధ్య పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ దూసుకుపోతోంది. సుమారుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ చ్చి 22 ఏళ్ళు పైన కావోస్తూన్న ఇప్పటికీ అదే అందాన్ని ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది నయనతార. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన నయనతార నిర్మాతగా కూడా అడుగు పెట్టింది. తమిళ్, తెలుగు, మలయాళం ,హిందీ వంటి భాషలలో నటిస్తూ ఉన్నది.


2003లో మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయనతార 2005లో తమిళ చిత్రం అయ్యా సినిమా ద్వారా ప్రేక్షకులకు అలరించింది .అదే ఏడాది చంద్రముఖి సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో మాత్రం లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఎంతోమంది హీరోలతో నటించిన నయనతార ఎన్నో పాత్రలకు నంది అవార్డును కూడా అందుకుంది. మధ్యలో కొంత మేరకు గ్యాప్ ఇచ్చి తెలుగు సినిమాలు  చేయలేదు.

నయనతార జీవితంలో శింబు, ప్రభుదేవా లాంటి హీరోలతో ప్రేమలో ఉండేదని గతంలో వినిపించాయి. నటుడు ప్రభుదేవాతో నయనతార సంబంధం పెళ్లి వరకు వెళ్లి చివరి నిమిషంలో రద్దయింది. అందుకు గల కారణం మాత్రం ఒక మిస్టరీగానే ఉన్నది.తాజాగా కోలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. క్రిస్టియన్ గా ఉన్న నయనతార ను మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని కండిషన్ ప్రభుదేవా పెట్టినప్పటికీ ఆమె ఓకే చెప్పినా వివాహం తర్వాత సినిమాలు  మానేయాలని కేవలం ఇంటికే పరిమితం కావాలని చెప్పడంతో ఆ కండిషన్ కు మాత్రం నయనతార ఒప్పుకోలేదట.. అలాగే తన మొదటి భార్య పిల్లలు కూడా తనతోనే ఉంటారంటూ ప్రభుదేవా చెప్పడంతో పెళ్లి రద్దు అయినట్లుగా కోలీవుడ్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా నయనతార ప్రభుదేవా కోసం తన కెరియర్ లో ఎన్నో ఆశలు, కలలు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారని కాని చివరికి బ్రేకప్ ఏ తనకు చాలా మంచి జరిగిందని నయనతార వ్యాఖ్యానించారు .నయనతార 2022లో ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు

మరింత సమాచారం తెలుసుకోండి: