
బన్నీ ఇంటికి వెళ్లిన మంచు లక్ష్మి కొద్దిసేపు అల్లు అర్జున్ కుమార్తె అర్హతో ముచ్చటించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మంచు లక్ష్మి నువ్వేదో నన్ని అడగాలనుకున్నావట? అని మంచు లక్ష్మి అడగగా.. అందుకు అర్హ ఇలా అడుగుతూ నువ్వు తెలుగు వేనా అంటూ నవ్వుతూ ప్రశ్నించింది.. అయితే ఇలాంటి ప్రశ్న మంచు లక్ష్మికి ఎదురవ్వడంతో ఊహించలేదు. దీంతో అవాక్కైనా మంచు లక్ష్మి తిరిగి నేను తెలుగే తెలుగమ్మాయినే పాప అంటూ తెలియజేసింది. నీకు అంత డౌటు ఎందుకు వచ్చింది?.. నేను మాట్లాడుతూ తోంది నీతో తెలుగులోనే కదా అంటూ నవ్వేసింది మంచు లక్ష్మి.
ఎందుకలా అడిగావ్ అంటూ మంచు లక్ష్మి అర్హ ను ప్రశ్నించగా.. నీ యాస కూడా అట్లాగే ఉంది అంటూ నవ్వుతూ బదిలించింది అర్హ. దీంతో లక్ష్మి నీ యాస కూడా అలాగే ఉందంటూ నవ్వుతూ అర్హను పట్టుకొని నవ్వేసింది. అందుకు సంబంధించి ఈ వీడియోని అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వీడియోతో మరొకసారి మంచు లక్ష్మి వార్తలు నిలుస్తోంది. మంచు లక్ష్మి ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే ఆమె ముంబైలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.