ధూమ్ ఫ్రాంఛైజీ అంటే మాస్‌కు మాస్ ఫీట్! స్పీడ్, స్టైల్, స్టంట్స్‌తో యాక్షన్ ఎలివేషన్‌కు బ్రాండ్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ‘ధూమ్ 3’ తర్వాత 12 ఏళ్ల గ్యాప్ వచ్చినా, ఇప్పుడు మరోసారి ధూమ్ 4 పేరు బాలీవుడ్‌లో పాపులర్ టాపిక్‌గా మారింది. కానీ ఈసారి మ్యాజిక్ ఏంటంటే... ధూమ్ లో దక్షిణాది నుంచి ఓ మెగా మాస్ హీరో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది – అదీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని గుసగుసలు!

వైఆర్ఎఫ్ గ్రాండ్ ప్లాన్.. తారక్ కీలకం?
యశ్ రాజ్ ఫిలింస్ (YRF) ఇటీవల పాన్ ఇండియా మోతాదును బాగా అర్థం చేసుకుంది. నార్త్‌లో స్టార్ పవర్ తో పాటు, సౌత్ మాస్ స్టార్స్‌ని కలిపి పాన్ వరల్డ్ మార్కెట్ దండయాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 ప్లాన్ చేసింది. అది ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు అందుకే లేటెస్ట్ బజ్ ఏంటంటే – వార్ 2 చివర్లో వచ్చే ఓ సీక్రెట్ సీన్‌తో ధూమ్ 4కి పునాది వేసే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, తారక్ ధూమ్ రేసులో ముందున్నాడన్నమాట.

ప్రభాస్ ఔట్ – తారక్ ఇన్?
ఇంతకుముందు ప్రభాస్ పేరు కూడా ధూమ్ 4కు చర్చల్లోకి వచ్చినా, ఇప్పుడు ఎన్టీఆర్ వైపే వెయిట్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండడం, రీసెంట్ అవుట్‌పుట్ తక్కువగా ఉండడం వల్ల అతడిపై ఫోకస్ తగ్గినట్లు ఇండస్ట్రీలో టాక్. దీంతో వార్ 2లో ఎన్టీఆర్ చేసిన పాత్రను YRF స్పై యూనివర్స్‌లో కొనసాగించాలనే ఆలోచన బలంగా ఉన్నట్లు సమాచారం.

స్పై యూనివర్స్: మాస్ మల్టీవర్స్ ప్లాన్?
వార్ 2 చివర్లో షారుక్ ఖాన్ (పఠాన్), సల్మాన్ ఖాన్ (టైగర్), ఆలియా, శార్వరి వంటి పాత్రలతో కలిపి YRF స్పై యూనివర్స్‌కు మెయిన్ గేట్ ఓపెన్ చేయనుందట. ఇదంతా మార్వెల్ మల్టీవర్స్ స్టయిల్లో సాగిపోతుంది. ఈ యూనివర్స్‌లో తారక్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఓ సౌత్ మాస్ హీరో ద్వారా నార్త్ మార్కెట్‌ను బలోపేతం చేయడమే వారి మెయిన్ స్ట్రాటజీ.

ఫైనల్ టాక్:
వార్ 2 బ్లాక్ బస్టర్ అయితే, ధూమ్ 4లో తారక్ జాయినింగ్ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీనితో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై వర్స్ లో తారక్‌తో మల్టీ మూవీ డీల్స్ కూడా స్కెచ్ అవుతున్నాయట. మొత్తానికి… బైక్ వేగం ధూమ్ లో ఉంటే, పవర్ పంచ్ మాత్రం తారక్ వంతే! వార్ 2తో బలం పెరిగితే… ధూమ్ 4లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గుర్రం ఎక్కేసినట్టే!

మరింత సమాచారం తెలుసుకోండి: