
మహేష్ బాబు 1979లో వచ్చిన నీడ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి చైల్డ్ యాక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించిన మహేష్ బాబు కొంత గ్యాప్ ఇచ్చి చదువు పైన ఫోకస్ పెట్టి ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. వంశీ, మురారి, టక్కరి దొంగ, ఒక్కడు, నిజం, అతడు, పోకిరి, బిజినెస్ మాన్, దూకుడు, భరత్ అనే నేను శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, గుంటూరు కారం ,సర్కారు వారి పాట తదితర చిత్రాలలో నటించారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమాలో నటిస్తున్నారు. మహేష్ బాబు , హీరోయిన్ నమ్రతాను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు వీరికి సితార అనే పాప, గౌతమ్ అనే కుమారుడు ఉన్నారు.
మహేష్ బాబు ఆస్తులు విషయానికి వస్తే సుమారుగా రూ.1200 కోట్లకు పైగా ఉన్నట్లు వినిపిస్తోంది. మహేష్ బాబు సినిమాలలోనే కాకుండా బ్రాండ్స్ ప్రకటనలతో భారీగానే సంపాదిస్తారు. దక్షిణాది ఇండస్ట్రీలోనే ఏ నటుడు కూడా మహేష్ బాబు దరిదాపుల్లోకి రాలేరు. అలాగే ఏఎంబి సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ బిజినెస్ ని మొదలుపెట్టారు. అలాగే ది హంబల్ కో అనే పేరుతో వస్త్ర వ్యాపారాన్ని మొదలుపెట్టారు. తన భార్య నమ్రత పేరు మీద ఒక రెస్టారెంట్ ని హైదరాబాదులో మొదలుపెట్టారు. జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ తో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే విధంగా మొదలుపెట్టారు. ఒక్కో చిత్రానికి రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అలాగే పద్మాలయ స్టూడియోతో పాటు, చాలా ప్రాంతాలలో ప్రాపర్టీస్ ఉన్నాయని, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లులు, పొలాలు, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు , తన తండ్రి సొంత ఊరిలో కూడా భారీగానే ఆస్తులు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. కానీ మహేష్ బాబు ఎంత సంపాదించినా కూడా తన సంపాదించిన దానిలో కొంత భాగం తన ట్రస్టు ద్వారా సహాయం అందిస్తూ ఉంటారు. మహేష్ బాబునే కాకుండా తన కూతురు సితార కూడా ట్రస్టు ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తోంది.