సూపర్ స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు, ట్రేడ్ సర్కిల్స్ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి సంబంధించి నటీనటులు, సిబ్బంది పారితోషికాల వివరాలు బయటకు వచ్చి కలకలం రేపుతున్నాయి. రజనీ 150 కోట్లు – లోకేష్ 50 కోట్లు .. సినిమా మొత్తం బడ్జెట్ సుమారు రూ. 375 కోట్లు. ఇందులోనే హీరో, దర్శకుడు పారితోషికాలే సగం పైగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. రజనీకాంత్‌కు ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ ఫిక్స్ కాగా, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కోసం రూ. 50 కోట్లు అందుకుంటున్నారని టాక్.


అంటే ఈ ఇద్దరి పారితోషికం కలిపి రూ. 200 కోట్లు అవుతుంది. నాగార్జునకు 24–30 కోట్లు .. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కూడా భారీ పారితోషికం అందింది.  ఇక ఆయనకు రూ. 24 కోట్ల నుంచి రూ. 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నాగ్ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఆమీర్ ఖాన్ ఉచితంగా .. హిందీ సినిమా స్టార్ ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో ఓ ముఖ్యమైన గెస్ట్ రోల్ చేస్తున్నారు. కానీ ఆయన ఈ పాత్ర కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిసింది. రజనీకాంత్, లోకేష్‌తో ఉన్న స్నేహం, స్క్రిప్ట్‌పై ఉన్న నమ్మకం వల్లే ఆమీర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్. బుకింగ్స్ హవా .. ‘కూలీ’ కేవలం పారితోషికాల వల్లనే కాదు, బుకింగ్స్‌లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

 

అమెరికాలో ఇప్పటికే మిలియన్ డాలర్ల మార్క్ దాటగా, భారతదేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 20 కోట్లను దాటేశాయి. కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో టికెట్లు సెకన్లలో అమ్ముడవుతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ సెన్సేషన్ ..  ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, భారతదేశంలోనే ‘కూలీ’ మొదటి రోజు గ్రాస్ వసూళ్లు రూ. 150 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ డేలోనే ఈ స్థాయి వసూళ్లు సాధిస్తే, ఇది సౌత్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద రికార్డుల్లో ఒకటిగా నిలుస్తుంది. మొత్తం మీద .. ‘కూలీ’ ఇప్పటికే పారితోషికాలు, బడ్జెట్, బుకింగ్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. రిలీజ్ రోజున రజనీ మాస్ పవర్, లోకేష్ స్టోరీ టెల్లింగ్ కలిస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర రాయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: