రేపు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగబోయే ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం ఊపందుకుంది. కారణం సింపుల్ – తారక్ పబ్లిక్ స్టేజిపై తన సినిమాకోసం మాట్లాడటం చూసి అక్షరాలా పుష్కరం గడిచింది. గత దశాబ్దంలో అన్న కళ్యాణ్ రామ్ సినిమాలు లేదా ఇతర హీరోల ఈవెంట్లకు అతిథిగా హాజరైనప్పటికీ, సోంత సినిమా ఈవెంట్ మాత్రం జరగలేదు. దేవర ఈవెంట్ మిస్సయిన చేదు జ్ఞాపకం .. గత ఏడాది ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుకను నోవాటెల్‌లో ప్లాన్ చేశారు. కానీ ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక, సెక్యూరిటీ రిస్క్ కారణంగా ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయింది.


వెన్యూ దాకా వచ్చిన అతిథులు క్యారవాన్లలో వెనక్కు వెళ్లిపోయారు. తారక్ అయితే వేదిక చేరే అవకాశమే రాలేదు. ఆ నిరాశను ఇంకా మరిచిపోని అభిమానులు, ఈసారి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు . వెన్యూ అదిరింది – కానీ వర్షం భయం! .. ఈసారి ఈవెంట్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరగనుంది. విస్తారమైన ప్రాంగణం కాబట్టి పెద్ద ఎత్తున జనానికి అనుమతి ఉంటుంది. ఫ్యాన్స్‌కి ఇది పెద్ద సంతోషం. అయితే గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం కొత్త టెన్షన్ తెచ్చింది. ముఖ్యంగా సాయంత్రం పూట కురుస్తున్న ఉగ్ర వర్షాలు, రోడ్లపై నీటి ముంపు, ట్రాఫిక్ జామ్‌లు – ఇవన్నీ ఈవెంట్ సక్సెస్‌కి ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒకవైపు ఫ్యాన్స్ సముద్రం, ఇంకో వైపు వర్షం సునామి – ఇది నిర్వాహకులకు పెద్ద సవాల్ అవుతుంది. హృతిక్ – తారక్ కాంబో స్పెషల్ అట్రాక్షన్ ..


ఈవెంట్ స్పెషల్ అట్రాక్షన్ హృతిక్ రోషన్ హాజరు. బాలీవుడ్‌లోని ఈ మేగా స్టార్ నోటి వెంట తారక్ గురించి ఎలివేషన్స్ వినే ఛాన్స్ రావడం అభిమానులకు అదిరిపోయే ఫీలింగ్ ఇస్తోంది. అలాగే గెస్ట్‌లుగా రాబోతున్న త్రివిక్రమ్, ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు చెప్పబోయే విశేషాలు కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్‌ను రెట్టింపు చేస్తున్నాయి . పబ్లిసిటీకి కీలకం .. ‘వార్ 2’ ప్రమోషన్లలో భాగంగా హీరో వైపు నుంచి పెద్దగా ప్రెస్ మీట్స్ లేకపోవడంతో, ఈ ఈవెంట్‌నే మేకర్స్ మెయిన్ పబ్లిసిటీ ఘట్టంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే వర్షం సహా ఎలాంటి విఘ్నాలు రాకూడదని నిర్మాతలు దేవుడి దగ్గర కోరిక పెట్టుకున్నారు. మొత్తానికి, రేపటి యూసఫ్ గూడ వేదిక తారక్ మాస్ రీ-ఎంట్రీకి సాక్ష్యం కానుంది. ఫ్యాన్స్ కేరింతలు, హృతిక్–తారక్ స్టేజ్ మోమెంట్స్, మాస్ ఎలివేషన్స్‌తో ‘వార్ 2’ ఈవెంట్ హిస్టారిక్ అవ్వడం ఖాయం

మరింత సమాచారం తెలుసుకోండి: