కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి  సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనేక మంది గొప్ప గొప్ప నటీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలలో , ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయనున్నారు.

రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడం , ఈ సినిమాలో ఎంతో మంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ నటులు భాగం కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇకపోతే రాయలసీమలో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి రాయలసీమ ఏరియాలో 10.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో రాయలసీమలో బిజినెస్ జరగడం అనేది మామూలు విషయం కాదు అని , ఇది సూపర్ సాలిడ్ రికార్డు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమాకు రాయలసీమ ఏరియాలో సూపర్ సాలిడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఆ స్థాయి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేయాలంటే ఈ మూవీ అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకోవాలి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను రాయలసీమలో వసూలు చేస్తుందో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: