ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలలో మహావతార నరసింహ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఒక విధంగా సంచలనాలను సృషించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికే 210 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఒక యానిమేషన్ మూవీ ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం అంటే ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి.

జులై 25వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇతర స్టార్ హీరోల సినిమాలకు సైతం షాకిస్తూ వీకెండ్ లో కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది. టైర్2, టైర్3 ఏరియాలలో సైతం ఈ సినిమా  కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తోందని చెప్పాలి. ఈ సినిమా సాధించిన విజయం గురించి దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ  కీలక వ్యాఖ్యలు చేశారు.

మన దేశంలో యానిమేషన్ అంటే కేవలం చిన్నారులకు సంబంధించింది అని భావిస్తారని దర్శకుడు చెప్పుకొచ్చారు. మహావతార నరసింహ సినిమాతో మేము ఆ అభిప్రాయాన్ని మార్చివేశామని ఆయన అన్నారు. ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని యానిమేషన్ సినిమాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలతో పాటు పెద్దలను సైతం ఈ సినిమా మెప్పించింది.

యానిమేషన్ ను పవర్ ఫుల్ మీడియంగా గుర్తించాలని లైవ్ యాక్షన్ లా యానిమేషన్ ను సైతం నిర్మాతలు సీరియస్ గా తీసుకోవాలని అశ్విన్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ తరహా ఈ తరహా సినిమాలకు యానిమేషన్ సరైన ఎంపిక అని కంటెంట్ బలంగా ఉంటే  స్టార్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాను చూడటానికి వస్తారని అశ్విన్ కుమార్ చెప్పుకొచ్చారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: