"జాన్వి కపూర్".. శ్రీదేవి ముద్దుల కూతురే అయినా.. ఇంకా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారలేకపోయింది. అయితే జాన్వి కపూర్ ఇప్పుడు రామ్ చరణ్‌తో ఒక పెద్ద సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ..ఈ సినిమాతోనైనా తెలుగులో ఒక బిగ్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ట్రై చేస్తోంది. ఇది పక్కన పెడితే, ఆమె తాజాగా నటించిన "పరమ్ సుందరి" సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా – జాన్వి కపూర్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో జాన్వి కపూర్ చాలా ఆకర్షణీయంగా, ఫన్నీగా, యాక్టివ్‌గా, నాటిగా మనల్ని మెప్పించబోతోంది అని అభిమానులు అంటున్నారు.


అలాగే ఈ సినిమా ట్రైలర్‌లో జాన్వి కపూర్, "ఆంధ్ర తెలుగు అల్లుఅర్జున్" అంటూ పుష్ప సినిమాలోని ఆయన మేనరిజాన్ని అద్భుతంగా నటించి చేసి చూపించింది. ట్రైలర్‌లోని అన్ని సీన్స్‌లో ఇది హైలైట్‌గా మారింది. దీంతో జాన్వి కపూర్ పేరు మళ్లీ ఇండస్ట్రీలో హాట్‌గా వైరల్ అవుతోంది. అయితే బన్నీ అభిమానులు – "మా బన్నీని వాడుకొని నువ్వు నీ పాపులారిటీ పెంచుకోవాలనుకుంటున్నావా?" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆమె బన్నీ ప్రస్తావనను ఎక్కడా అడగకుండానే తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే జాన్వి కపూర్‌కి బన్నీ అంటే నిజంగా ఇష్టం, ఆయనతో స్క్రీన్ షేర్ చేయాలనుకుంటుందేమో..?? అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.



మొత్తానికి, పుష్ప సినిమా క్రేజ్‌ను వాడుకొని హిట్ కొట్టాలని జాన్వి కపూర్ చూస్తోందని కొంతమంది అంటుండగా, మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వి కపూర్సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ్ సుందరి ట్రైలర్ ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది. చూడాలి మరీ ఈ సినిమాతోనైన శ్రీదేవి పేరు నిలబెట్టే కూతురిగా జాన్వీ కపూర్ మారుతుందో లేదో..???



మరింత సమాచారం తెలుసుకోండి: