రీసెంట్ గానే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.చాలామంది అక్కాచెల్లెళ్లు తమ సోదరికి రాఖీ కట్టి దీవెనలు తీసుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ రాఖి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.ఇందులో భాగంగా బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్  దాదాపు 17 సంవత్సరాల నుండి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఓ నటుడికి రాఖీ కడుతుందట. అయితే అలా అని వారు ఇద్దరి మధ్య రక్తసంబంధం ఏమి లేదు. కానీ 17 సంవత్సరాలుగా ఈ రాఖీ సెలబ్రేషన్స్ ని ఆయనతో కలిపి జరుపుకుంటుంది.మరి ఇంతకీ రక్తసంబంధం లేకుండానే ఐశ్వర్యరాయ్ తో రాఖీ కట్టించుకునే ఆ నటుడు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ రాఖీ కట్టే వ్యక్తి ఎవరో కాదు నటుడు సోనూ సూద్..విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా ఎన్నో సినిమాల్లో రాణిస్తున్న నటుడు సోను సూద్ కి ఐశ్వర్యారాయ్ ప్రతి ఏటా రాఖీ కడుతుందట. అయితే వీరిద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందంటే..జోధా అక్బర్ సినిమా సమయంలో.. ఈ జోధా అక్బర్ సినిమాలో మహారాణి జోధాబాయి పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించింది. అలాగే సోనుసూద్ ఐశ్వర్యరాయ్ సోదరుడి పాత్రలో నటించారు.ఈ సినిమాలో తన సోదరి జోధా బాయి కోసం రాజ్యాన్ని సైతం పణంగా పెట్టే కున్వర్ సుజామల్ అనే సోదరడు పాత్రలో సోనుసూద్ నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్లో జోధాబాయి పాత్రలో నటించిన ఐశ్వర్యరాయ్ కున్వర్ సుజామల్ కి రాఖీ కట్టినప్పటినుండి వీరిద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఏర్పడిందట.
అప్పటినుండి వీరు ప్రతి సంవత్సరం రాఖీ సెలబ్రేషన్స్ ని జరుపుకుంటున్నారట. దాదాపు 17 ఏళ్లుగా ఐశ్వర్య సోనూ సూద్ కి రాఖీ కడుతుందట.అయితే ఈ విషయాన్ని స్వయంగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతేకాదు ఐశ్వర్యారాయ్ తనని బాయ్ సాబ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తుందని, అలాగే జోధా అక్బర్ సినిమాలో నటించిన సమయంలో ఓ సీన్ చేస్తున్నప్పుడు నేను సేమ్ ఐశ్వర్య తండ్రి లాగే ఉన్నానంటూ ఆమె తన తండ్రిని గుర్తుచేసుకుంది.అలాగే ఐశ్వర్యరాయ్ కోడలుగా వెళ్లిన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అద్భుతమైన కుటుంబం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.అలా దాదాపు 17 ఏళ్ల నుండి సోనూ సూద్ కి ఐశ్వర్య రాఖీ కడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: