
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన శ్రీదేవి, తర్వాత పలు షోల్లో జడ్జిగా కనిపించారు. పెళ్లి, పిల్లలు అన్న తర్వాత కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గకపోవడంతో అభిమానులు తరచూ "మళ్లీ సినిమాలు చేయాలి" అని డిమాండ్ చేశారు. ఆ కోరిక మేరకే ఇప్పుడు శ్రీదేవి మళ్లీ హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా, వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో వస్తోన్న “సుందరకాండ” సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో దర్శకుడు ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు.
అందులో ఆయన మాట్లాడుతూ – “సినిమాలో ఓ సీన్ కోసం శ్రీదేవి స్కూల్ యూనిఫార్మ్ లో కనిపించాలి. ఆ సీన్ చేస్తే నిజంగా సరిపోతుందా? అనేది నాకు పెద్ద టెన్షన్. లుక్ టెస్ట్ చేసినప్పటికీ భయం అలాగే ఉండేది. కానీ షూటింగ్‌కి వెళ్లినప్పుడు యూనిఫార్మ్‌లో నిజంగానే చాలా బాగా కనిపించారు. ఇది ఎలా సాధ్యం అయింది అని అడిగితే, ఆమె ఆ సీన్ కోసం కొన్నాళ్లపాటు ఫుడ్ తీసుకోకుండా కేవలం వాటర్ మాత్రమే తాగిందని చెప్పారు. ఆ డెడికేషన్ చూసి నేను షాక్ అయ్యా” అని తెలిపారు.
దీంతో అక్కడున్న అందరూ శ్రీదేవిని తెగ ప్రశంసించారని, అలాంటి కష్టాలు చేసి చేస్తున్న ఈ సినిమాపై ఆమెకు కూడా భారీ నమ్మకం ఉందని చెప్పారు. 37 ఏళ్ల వయసులో కూడా ఇలా కష్టపడి తనను మళ్లీ హీరోయిన్‌గా నిరూపించుకోవడానికి ప్రయత్నించడం నిజంగా గొప్ప విషయమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇకపోతే, "సుందరకాండ" మూవీ సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్న శ్రీదేవి, ఈ రీఎంట్రీ తర్వాత మళ్లీ మంచి అవకాశాలు రాకపోవడం అసాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, ఈ ఆగస్టు 27న రాబోతున్న "సుందరకాండ" – శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ మొదలవ్వబోతోంది.