
ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఇండియా డే పరేడ్" ఘనంగా జరిగింది. ఇది అమెరికాలో జరిగే అతిపెద్ద భారతీయ పరేడ్. ఈ వేడుకకు అనేకమంది భారతీయ–అమెరికన్లు, విదేశీ స్నేహితులు హాజరయ్యారు. ముఖ్యంగా సినీ స్టార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి 2025 సంవత్సరానికి గాను గ్రాండ్ మార్షల్‌గా హాజరైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతినిధులుగా చాటి చెప్పారు. వీరిని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ పరేడ్‌లో వీరిద్దరినీ జంటగా చూసిన వారు, “అచ్చం భార్యాభర్తలాగే ఉన్నారు. నిజమైన భార్యాభర్తలు కూడా ఇంత ఆనందంగా ఉండరు. త్వరలోనే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు ..
మరికొంతమంది అయితే, “వీళ్లు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారేమో. అందుకే ఇంత చనువుగా, ఇంత ఆనందంగా కనిపిస్తున్నారు” అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పబ్లిక్‌లో ఏ హీరో–హీరోయిన్ ఇలా ఉండరు. అలా ఉన్నారంటే ప్రేమ ఉన్నట్టే. త్వరలోనే రష్మిక–విజయ్ జంట నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నాం” అని ఫ్యాన్స్ అంటున్నారు. చూద్దాం..మరి వీళ్ళ నుంచి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వినబోతున్నామో ...??