వార్ 2 సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకున్నాక, సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న అంశం తెలుగు హీరోలు బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ డిజాస్టర్లను తమ ఖాతాలో వేసుకున్న సినిమాల గురించి. ముఖ్యంగా రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు బాలీవుడ్‌లో సినిమాలు చేసి బిగ్ డిజాస్టర్‌ను చవిచూశారు. తర్వాత తెలుగులో తిరిగి హిట్స్ కొట్టడానికి చాలా కష్టపడ్డారు. వీళ్లను చూసిన తర్వాత కూడా తారక్ ఎందుకు బాలీవుడ్‌కి వెళ్లాడో అర్థం కావడం లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో తారక్, చరణ్, ప్రభాస్ చేసిన తప్పు మహేశ్ బాబు చేయకుండా భలే సేఫ్ గా తప్పించుకున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు.


ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న మహేశ్ బాబుకి గతంలో ఎన్నోసార్లు బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇంటికే వచ్చి, “మీకు ఇప్పటికే ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో సినిమా చేయండి” అంటూ రిక్వెస్ట్ చేశారు. కానీ మహేశ్ బాబు మాత్రం ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా ఆయన భార్య నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ బ్యూటీ. అక్కడ మంచి ఇమేజ్ ఉంది. మహేశ్ బాబు అనుకుంటే అక్కడికి వెళ్లి సులభంగా సెటిల్ అవ్వొచ్చు. కానీ ఆయన మాత్రం “తెలుగు ఇండస్ట్రీనే నా లైఫ్ ఇచ్చింది. ఇక్కడే సినిమాలు చేస్తే చాలు” అంటూ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని తెలుగు సినిమాలపై పెట్టాడు.



అలా తీసుకున్న డిసిషన్ వల్లే మహేశ్ బాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. అందుకే చాలా మంది, “తారక్–చరణ్–ప్రభాస్ అత్యాశతో బుక్ అయ్యారు. కానీ మహేశ్ బాబు మాత్రం ఉన్నదానితో సంతృప్తి పడుతూ ప్లాప్స్‌కి దూరంగా ఉన్నాడు” అని అంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కి కూడా దూరంగా ఉండిపోయాడంటూ ప్రశంసిస్తున్నారు. మహేశ్ బాబు ఎప్పుడూ స్మార్ట్ డెసిషన్లు తీసుకుంటాడని ఫ్యాన్స్ పొగడ్తలు కురిపిస్తున్నారు. చూడాలి మరి దీనిని చూశాక అయిన మిగతా హీరోలు మారుతారు ఏమో..??

మరింత సమాచారం తెలుసుకోండి: