
ఇప్పుడు ఆగష్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఒక సమస్య – సీజీ వర్క్ సాటిస్ఫై చేయకపోతే టీజర్ ని వదలకూడదని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలు అతి పీక్ లో ఉన్నాయి. చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాకి టీజర్ లేదా ట్రైలర్ బాగాలేకపోతే నెగిటివిటీ పెరుగుతుందని ఇప్పటికే చాలాసార్లు చూసాం. కనుక ఈసారి విశ్వంభర టీం ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదు. ఒకవేళ సీజీ అవుట్‌పుట్ బాగాలేదని అనిపిస్తే.. ఆగస్టు 22న టీజర్ బదులు ఒక పోస్టర్ తో సరిపెట్టుకోవచ్చని టాక్. సినిమా మాత్రం మాస్, క్లాస్ ఆడియన్స్ రెండింటినీ ఎంటర్‌టైన్ చేసేలా రూపొందుతోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. అక్టోబర్ రెండో లేదా మూడో వారం సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
కానీ అసలు టాక్ ఏమిటంటే – టీజర్/ట్రైలర్ తోనే సినిమా ఓపెనింగ్స్ దాదాపు 50% వరకు డిసైడ్ అవుతాయి. కనుక సీజీ వర్క్ ని కాంప్రమైజ్ చేస్తే లాభం ఉండదని టీం క్లియర్ గా అర్థం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీజీ నాణ్యత గురించి ఆడియన్స్ చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఒక్క లోపం కనిపించినా, అది సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ రూపంలో వైరల్ అవుతుంది. అలాంటప్పుడు మెగాస్టార్ సినిమాకి ఇలాంటి నెగిటివ్ వేవ్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టమే. అందుకే ఇప్పుడు విశ్వంభర టీం ఒకే లక్ష్యం పెట్టుకుంది – సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా చేసి టీజర్ తోనే సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. చిరంజీవి బర్త్ డే రోజు టీజర్ వచ్చి హిట్ అయితే.. సినిమాపై ఉన్న నెగిటివిటీ ఒక్కసారిగా పాజిటివ్ హంగామాగా మారిపోతుంది.