కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఇష్యూ చేస్తూ కాంట్రవర్సీకి తెర లేపుతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన వైవాహిక జీవితం పై సంచలన కామెంట్లు చేసింది.నాకు పెళ్లి కాలేదని మీకు చెప్పానా.. పిల్లలు లేరని మీకు చెప్పానా..అంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ 39 ఏళ్ల కంగనా రనౌత్ ఇప్పటికే రహస్యంగా పెళ్లి చేసుకుందా.. ఆమె పెళ్లి చేసుకోలేదని మీకు చెప్పానా అని అన్న మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది.అందుకే ఈమెకు కాంట్రవర్సీ క్వీన్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. అలా ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రాజకీయాల్లోకి కూడా వచ్చింది. 

అలా హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన కంగనా ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంది.అయితే ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే మరోవైపు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెడుతుంది.ఇందులో భాగంగా రీసెంట్ గా సహజీవనంపై సంచలన కామెంట్లు చేసింది. సహజీవనం అనేది బుద్ధిలేని చర్య అని, దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు అని పెళ్లి చేసుకొని రిలేషన్ లో ఉండడమే బెటర్ అంటూ చెప్పింది.అలాగే 39 ఏళ్ల కంగనా యొక్క పెళ్లి గురించి ప్రశ్న ఎదురవుగా నేను పెళ్లి చేసుకోలేదని మీకు చెప్పానా ఎక్కడైనా.. నా పెళ్లి కాలేదని అన్నానా?

మీరు ఎలా ఊహించుకుంటారు నా పెళ్లి కాలేదని..ఏమో పెళ్లి జరిగింది కావచ్చు..పిల్లలు కూడా ఉన్నారు కావచ్చు.. మీకే అన్ని తెలుసు అని ఊహించుకోకండి అంటూ సీరియస్ గా మాట్లాడింది. అయితే అప్పటివరకు సీరియస్గా ఉన్న కంగనా ఒక్కసారిగా నవ్వేసి ఊరికే అన్నాను. నిజంగానే నాకు పెళ్లి జరిగిందని ఊహించుకోకండి.నేను ఇప్పటివరకు అన్న మాటలు అన్ని జోక్ గా అన్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చింది.అయితే అప్పటివరకు నాకు పెళ్లి జరగలేదని మీకు చెప్పానా అని సీరియస్ గా మాట్లాడడంతో నిజంగానే కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుందని చాలామంది అనుకున్నారు కానీ లాస్ట్ కి సడన్ ట్విస్ట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: