టాలీవుడ్‌లో సినిమాలు హిట్ అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం బయ్యర్ల కష్టాలు ప్రారంభమవుతాయి. తాజాగా అదే పరిస్థితి “హరి హర వీరమ‌ల్లు ” సినిమా విషయంలో కనిపిస్తోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కుప్పకూలిపోవడంతో, బయ్యర్లు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఇప్పుడు ఆ నష్టాల కారణంగా నిర్మాత రత్నంపై ప్రెజర్ పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ రోజు హైదరాబాద్‌లో  “హరి హర వీరమ‌ల్లు ”  సినిమా బయ్యర్ల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల నుంచి బయ్యర్లు హాజరయ్యారు.
 

వీరంతా కలిసి ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్‌ను కలిసి, నిర్మాత రత్నం వెంటనే జీఎస్టీ ఇన్‌వాయిస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. ఈ ఇన్‌వాయిస్‌ల ద్వారా తమకు వచ్చిన నష్టాలను లీగల్‌గా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందని బయ్యర్లు భావిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో సీడెడ్ ఏరియా హక్కులు కొన్న శోభన్, వైజాగ్ ఏరియా తీసుకున్న సతీష్, వెస్ట్ గోదావరి ఏరియా హక్కులు దక్కించుకున్న ఉషా సంస్థ, గుంటూరు, నెల్లూరు ఏరియాలు కొన్న డాక్టర్ పవన్ ఉన్నారని సమాచారం. వీరంతా ఒకే మాట చెబుతున్నారు – సినిమా డిజాస్టర్ కావడంతో తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని నిర్మాత రత్నం భర్తీ చేయాల్సిందేనని.


ముఖ్యంగా, జీఎస్టీ ఇన్‌వాయిస్‌లు ఇవ్వాలంటే నిర్మాత రత్నం మీద పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ భారం పడే అవకాశముంది. కోట్లలో నష్టాన్ని భరించాల్సిన పరిస్థితి వస్తే, నిర్మాత పరిస్థితి మరింత క్లిష్టం కానుంది. మరోవైపు, బయ్యర్లు మాత్రం తమకు న్యాయం జరగాల్సిందేనని పట్టుదలగా ఉన్నారు. ఇక ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నట్టు, ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్‌గా మారే ఛాన్స్ ఉంది. నిర్మాత రత్నం బయ్యర్ల డిమాండ్లను అంగీకరిస్తాడా ? లేక వివాదం ఇంకా పెద్దది అవుతుందా ? అన్నది చూడాలి. కానీ మొత్తానికి  “హరి హర వీరమ‌ల్లు ”  సినిమా ఫ్లాప్ , బయ్యర్ల మీటింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ డిస్కషన్‌గా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: