కేవలం కొద్ది గంటల్లోనే చిరంజీవి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు తమ పుట్టినరోజులను మర్చిపోతారేమో కానీ స్టార్ సెలబ్రిటీల ఫ్యాన్స్.. ముఖ్యంగా డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ హీరో పుట్టినరోజును అస్సలు మర్చిపోరు. ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఉద్యోగాన్ని సైతం రిస్క్‌లో పెట్టుకొని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి ఫ్యాన్స్ ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చాలామంది మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే హంగామా స్టార్ట్ చేశారు.
 

కొందరు మెగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తుండగా, మరికొందరు అన్నదానం కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఇంకొందరు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పెద్ద కేకులతో సంబరాలకు సిద్ధమవుతున్నారు. అర్థరాత్రి 12 గంటల నుంచి మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫుల్‌గా జరగనున్నాయి. ఇక సినీ వర్గాలు మాత్రం ఆయనకు సంబంధించిన నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా విశ్వంభర సినిమా, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్లు రాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మరో బిగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాబోతుందన్న వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


సెన్సేషనల్ డైరెక్టర్‌కి  చిరంజీవి ఛాన్స్ ఇచ్చారని టాక్. ప్రముఖ యంగ్ డైరెక్టర్ బాబికొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కెవి నారాయణ నిర్మించబోతున్నారని సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది  అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలా చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ఉండటం మెగా ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలు ఆయనకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడతాయో..???

మరింత సమాచారం తెలుసుకోండి: