అప్ప‌ట్లో బుక్ మైషోలు, జస్ట్ టికెట్స్ మాకు తెలియవు.,
థియేటర్ బయట పోలీసులు తరుముతుంటే అర్ధరాత్రి పూట పరుగులు తీయకుండా కిలోమీటర్ల లైనులో నుంచొని టికెట్లు వస్తాయా, రావా అని టెన్షన్ పడుతూ,  కౌంటర్ లో వంద చేతుల మధ్య డబ్బు జారిపోకుండా మా చేతులని పెట్టి టికెట్ తీసుకోవడమే మాకు తెలుసు. ఆన్లైన్ లు, జుక్ బాక్స్ లు మాకు తెలియదు.,  ఆడియో షాప్ లో తెల్లవారుజామున మొదటి బంచ్ ఆడియో కాసెట్స్ లో ఫస్ట్ క్యాసెట్ కొన్న కిక్ మాకు తెలుసు.


Wynk, spotify యాప్ లు మాకు తెలియవు. ఏదో ఒక షాప్ లో కూర్చుని ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి రేపు థియేటర్ లో స్టెప్ లు ఏ రేంజ్ లో ఉంటాయో అని ఊహించుకోవడం మాకు తెలుసు. ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు మాకు తెలియవు. పెయింటర్ వేసిన కటౌట్ ని పెడుతుంటే ఫేస్ పెట్టే టైం లో అర్ధరాత్రి కొన్ని వందలమంది వేసిన ఈలలు మాకు తెలుసు. యూట్యూబ్ లో సాంగ్స్, వ్యూస్ ఇవేమీ మాకు తెలియవు. చివరి వరకు సినిమా చూసేసి  అరిచి అరిచి బొంగురు గొంతుతో గుంపులు గుంపులు గా వెళ్లిపోవడం మాకు తెలుసు.


Idle బ్రెయిన్ రేటింగ్ లు, గ్రేట్ ఆంధ్రా రివ్యూ లు మాకు తెలియవు. సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అంటూ అరుచుకుంటూ వెళ్లడం లో ఉన్న కిక్ మాకు తెలుసు. ఇన్ని వేల ఆనందాలు ఇచ్చావ్, అంతకుమించి ఎన్నో రేట్ల జ్ఞాపకాలను ఇచ్చావ్. జీరో నుంచి మొదలుపెట్టి, శిఖరం చేరుకున్న వాడివి ఆ రూట్ గురించి వేరే వాడు నీకు చెప్పాల్సిన పని లేదు. గన్ కన్నా పవర్ ఉన్న తమ్ముడు నీకు ఉన్నాడు. నీ పేరు శాశ్వతం గా నిలబెట్టే కొడుకు నీకు ఉన్నాడు. నీ ఇమేజ్ కి వన్నె తగ్గకుండా చూసే చెల్లెళ్ళ కొడుకులు, తమ్ముళ్ళ కొడుకులు ఉన్నారు. అన్నిటికీ మించి నిన్ను గుండెల్లో పెట్టి ఆరాధించే కోట్ల మంది అభిమానులు ఉన్నారు. తెలుగు సినిమాకి మకుటం లేని మహారాజువి నువ్వు... మెగాస్టార్ చిరంజీవికి ఇండియా హెరాల్డ్‌. కామ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: