
హృతిక్, ఎన్టీఆర్ సినిమాల్లో కొన్ని సీన్స్ పై ఆర్జీవీకి చాలా కంప్లయింట్స్ ఉన్నాయని తెలిపాడు. హృతిక్ ఎంట్రీ ఫైట్ సీన్ గురించి సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తిని అడిగితే కొత్తగా ఉండాలని పెట్టినట్టు అతను చెప్పిన సమాధానంపై ఆర్జీవీ తన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. లాజిక్ లేని సీన్స్ తీస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వరు అని ఆర్జీవీ చెప్పాడు.
సినిమాలో కావాల్సిన చోట భారీతనాన్ని చూపించకుండా చూపిస్తే కథ చచ్చిపోతుంది అని ఆర్జీవీ అన్నాడు. పరుచూరి మాదిరిగా యూట్యూబ్ లో సినిమాలు విశ్లేషించాలని ఉన్నా కూడా తాను అలా చేయనని ఆర్జీవీ అన్నాడు. అలా చేస్తే తనకు తెలిసినవారు బాధపడతారని అందుకని అలా చేయనని అతను చెప్పుకొచ్చారు. వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చింది.
వార్2 సినిమా హిందీలో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిరాశ పరిచింది. జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. తారక్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఒకింత భారీ స్థాయిలో ఉంది. వార్2 సినిమా ఏ స్థాయిలో రికార్డులు చేస్తుందో అని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు