పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజి. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్ విపరీతంగా అంచనాలను పెంచేశాయి. అందుకే అభిమానులు ట్రైలర్ కోసం కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. అయినప్పటికీ చిత్ర బృందం పలు రకాల అప్డేట్లను విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఓజీ చిత్రం నుంచి రెండవ సాంగ్ "సువ్వి సువ్వి" అనే పాటను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.


ఈ మేరకు ఒక స్పెషల్ కలర్ ఫుల్ ఫోటోతో పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో అటు పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ కలిసి నీటిలో దీపాలను వదులుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నప్పటికీ ఇందులో లవ్ స్టోరీ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓజి సినిమా సెప్టెంబర్ 25న చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదలై అభిమానులను నిరాశకు గురిచేసింది.


ముఖ్యంగా విఎఫ్ఎక్స్ సరిగా లేకపోవడం చాలామంది ట్రోల్ చేశారు. దీంతో కలెక్షన్స్ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కంటే ఇందులో ఎక్కువగా డూప్ ఉపయోగించారనే విధంగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు 2 ఉంటుందనే విధంగా వినిపించాయి. దీనివల్ల ఓజి సినిమా పైన అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. డైరెక్టర్ సుజిత్ కూడా ఈ సినిమాని చాలా కాన్ఫిడెంట్ గానే తెరకెక్కిస్తున్నారు. ఇందులో కూడా భారీగానే తారాగణం  నటిస్తోంది. తదుపరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని కూడా పూర్తి చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: