
పరిణీతి చోప్రా పోస్ట్:
పరిణీతి చోప్రా తన సోషల్ మీడియా ద్వారా" 1+1=3" అనే అక్షరాలతో ఒక ప్లేటు పైన ఉన్నటువంటి కేకు చిన్న పాదాల ముద్రలు ఉన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత ఈ జంట ఇద్దరు కూడా చేతులు పట్టుకొని నడుస్తూ ఉన్నట్లుగా ఒక వీడియోని షేర్ చేశారు. పరిణీతి చోప్రా , రాఘవ్ ఇద్దరు కూడా 2023 సెప్టెంబర్ 24న వివాహం చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. పరిణీతి చోప్రా ఎవరో కాదు స్టార్ హీరోయిన్గా పేరుపొందిన ప్రియాంక చోప్రా కు కజిన్ అవుతారు.
వివాహమైన రెండేళ్లకే:
పరిణీతి చోప్రా లండన్ లో ఆర్థిక రంగంలో కూడా ఉద్యోగం చేసింది. నటన పైన ఇష్టం ఉండడంతో 2011లో లేడీస్ వర్సెస్ రిక్కి బెహ్ల్ అనే చిత్రంలో సహాయనిటిగా నటించింది. ఆ తర్వాత తనకు పేరు రావడంతో సినిమాలో నటించడమే కాకుండా గాయనీగా పేరు సంపాదించింది. 2024లో అమర్ సింగ్ చంకిల అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే బుల్లితెర పైన కూడా కొన్ని షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది పరిణీతి చోప్రా . ఇవే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో నటించి బాగానే పేరు సంపాది. అలాగే ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. మొత్తానికి వివాహమైన రెండేళ్లలోపే గుడ్ న్యూస్ చెప్పేసింది పరిణీతి చోప్రా . ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతున్నది.