
ఇక తాజాగా ఇదే మెగా సాంప్రదాయం ఇప్పుడు బాలయ్య దగ్గర కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమాకు మళ్లీ తనకు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా బాలయ్య కెరీర్‌లో ఒక మైలురాయి లాంటి హిట్. ముఖ్యంగా ఆయన పవర్‌పుల్ డైలాగ్స్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
అందుకే ఇప్పుడు ఈ జోడీ మరోసారి కలిస్తే ఎలాంటి అంచనాలు పెరుగుతాయో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కాంబోపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. బాలయ్య గోపీచంద్ మలినేని కి మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని చూసి కొందరు "బాలయ్య కూడా మెగా సాంప్రదాయం ఫాలో అవుతున్నాడు" అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం "బాలయ్య ఎవరినీ అనుకరించరు, ఆయన నిర్ణయం ఆయనదే. ఫ్యాన్స్ కోసం, సినిమాకి బెనిఫిట్ ఉంటుందని భావించి చేసిన స్ట్రాటజీ ఇది" అంటూ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు – బాలయ్య అనుకున్న పని ఆయన తప్పకుండా చేసి తీరుతారు. ఆయనకు నచ్చితే మళ్లీ మళ్లీ అదే డైరెక్టర్‌తో పని చేయడానికీ వెనకాడరు. ఆ ధైర్యమే ఆయన ప్రత్యేకత. అందుకే ఈసారి కూడా బాలయ్య.. గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై అందరి దృష్టి పడింది. కొందరు ఇది ఏదో తేడా కొడుతుంది రా సీనా అంటూ కూడా ఘాటు కౌంటర్స్ వేస్తున్నారు.