
అసలు ఏమైందంటే .. మనందరికీ తెలిసినట్టుగానే, మెగా ఫ్యామిలీ ప్రస్తుతం చాలా హ్యాపీ మూడ్‌లో ఉంది. త్వరలోనే ఇంట్లోకి మరో కొత్త సభ్యుడు రాబోతున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి గర్భవతిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ, రకరకాల పోస్టులు షేర్ చేస్తూ అభిమానులతో తన జర్నీని పంచుకుంటోంది. అలాంటి లావణ్య త్రిపాఠి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కొందరు షాక్ అవుతున్నారు.
"బేబీ బంప్‌తో లావణ్య త్రిపాఠి వినాయకుడి పూజలో ఎలా కూర్చుంది?" అంటూ విమర్శిస్తున్నారు. చాలామంది పెద్దవాళ్ల అభిప్రాయం ప్రకారం.. గర్భధారణ ఆరు నెలలు దాటిన తర్వాత ఏ పూజలోనూ పాల్గొనకూడదు, గుడికి వెళ్లకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కడుపులోని శిశువు అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. అందువల్ల వారిని మైలు స్త్రీలతో సమానంగా పరిగణిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత పురిటి స్నానం చేసి గడచిన తరువాతే మళ్లీ దేవుని దర్శనం చేయాలని పెద్దలు చెబుతారు. అయితే లావణ్య త్రిపాఠికి ఇది తెలియదా? ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ చెప్పలేదా? అని కొందరు మండిపడుతున్నారు. ఇది పెద్ద అపచారం అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం వేరే క్లారిటీ ఇస్తున్నారు. “లావణ్య పూజలో కూర్చోలేదు, పూజ పూర్తయిన తరువాత వినాయకుడి వద్ద కూర్చొని దండం పెట్టి ఫోటో దిగింది అంతే” అని అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి బేబీ బంప్ ఫొటోలు, అలాగే ఆమె చేసిన "బిగ్ మిస్టేక్" నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఒకలా స్పందిస్తుంటే, మెగా హేటర్స్ ఇంకోలా కామెంట్లు చేస్తున్నారు.