
మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. వాస్తవానికైతే.. ఈ సినిమా ఒక బోల్డ్ అటెంప్ట్ అనే చెప్పాలి. కానీ దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి చాలా జాగ్రత్తగా, కన్వీన్సింగ్‌గా కథ, కథనం రాసుకున్నాడు. ఫ్యామిలీ సబ్జెక్ట్ కావడంతో.. నారా రోహిత్ ఈ సినిమాను మరో మెట్టుకి తీసుకెళ్లేలా తన నటనతో ఆకట్టుకున్నాడు. చాలా కాలానికి తనకు ఇది పర్ఫెక్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ సినిమా కాన్సెప్ట్‌కు తగ్గట్టుగా హీరోయిన్ శ్రీదేవికి కూడా మంచి రీ ఎంట్రీ పడింది. అలాగే.. హీరోయిన్ వృతి వాగానికి మంచి క్యారెక్టర్ దొరికింది. తనకంటే సీనియర్‌ను ప్రేమించి దూరమైన అబ్బాయి.. పెళ్లి చేసుకుంటే మళ్లీ అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూడడం.. అలాంటి అమ్మాయి దొరికినప్పుడు ఊహించని ట్విస్ట్‌తో సినిమా కొత్త మలుపు తీసుకోవడం.. ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతినిచ్చేలా సుందరకాండ మెప్పిస్తుంది.
సినిమాల్లో ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తుంటాయి. అసలు ఇలాంటి సెన్సిబుల్ కథలు చేయాలంటే హీరోకి గట్స్ ఉండాలి. ఏ మాత్రం తేడా కొట్టిన విమర్శలు తప్పవు. కానీ మొదటి నుంచి నారా రోహిత్ ఏది చేసిన ప్రత్యేకమే. మరోసారి సుందరకాండతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. మంచి ఎంటర్టైన్ చేయడంతో పాటు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవడంలో సుందరకాండ సక్సెస్ అయినట్టే.