నటి ఆమని అచ్చ తెలుగు ఆడపిల్లలా.. బాపు బొమ్మలా.. ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక సీరియల్స్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చాలామంది హీరోయిన్లు ఒకానొక దశలో ఫేడౌట్ అవ్వాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలో కొనసాగాలనుకున్నవాళ్లు ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేయగలుగుతారు. మరికొంత మందేమో ఆ పాత్రలు చేయడం ఇష్టం లేక సినిమా ఇండస్ట్రీ ని వదిలేసి వెళ్ళిపోతారు. అలా సీనియర్ నటి ఆమని మాత్రం సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్చితో ఇంకా సినిమాల్లో కొనసాగుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ షోలో పెళ్లికి ముందే ఓ హీరో మీద మోజు పడిన విషయాన్ని బయట పెట్టింది.మరి ఇంతకీ ఆమని అంతగా ఇష్టపడిన ఆ హీరో ఎవరయ్యా అంటే..

మెగాస్టార్ చిరంజీవి.. అవును ఈ విషయాన్ని చాలా సందర్భాలలో చెప్పింది. ఆమని ఇష్టపడిన చిరంజీవితో ఒక్క సినిమాలోనైనా కలిసి నటించే అవకాశం రావాలి అని ఎంతగానో కోరుకుంది. కానీ అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఒకసారి ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయిందట.అయితే డాడీ మూవీలో ఈ హీరోయిన్ కి అవకాశం వచ్చింది అనే విషయం తెలిసి ఆమని ఎగిరి గంతేసిందట. కానీ ఆ తర్వాత డైరెక్టర్ వచ్చి అందులో మీది సిస్టర్ రోల్ అని చెప్పడంతో నో సార్ నేను చేయలేను. ఎప్పటికైనా సరే చిరంజీవితో నటిస్తే ఆయన పక్కన హీరోయిన్ గానే నటించాలి. ఆయనకి ఫ్లాష్ బ్యాక్ లో లవర్ అయినా పర్వాలేదు. ఆయన భార్య పాత్రలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయినా పర్వాలేదు. కానీ ఆయనకు మాత్రం సిస్టర్ పాత్రలో చేయలేను అంటూ చెప్పిందట.

అయితే మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న ఇష్టంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఫోటోలన్నీ తన సోదరుడికి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కొని తీసుకురమ్మని చెప్పేదట.అలా తీసుకువచ్చిన ఫోటోలను తన తల్లికి తెలియకుండా ఒక ఆల్బమ్ తయారు చేసుకొని బెడ్ రూమ్ లో ఉండే దిండు కింద పెట్టుకొని ప్రతిసారి ఆ ఫొటోస్ చూస్తూ తెగ మురిసిపోయేదట.అంతేకాదు ఎప్పటికైనా సరే చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయలని కలలు కనేదట.అయితే ఈ విషయాలన్నీ ఆమని ఆలీ హోస్ట్ గా చేసే ఆలీతో సరదాగా అనే షోలో బయట పెట్టింది. అలా ఆమనికి చిరంజీవి మీద ఇష్టం రోజురోజుకీ పెరిగిపోతుంది. కానీ ఇప్పటి వరకు చిరంజీవి తన సినిమాలో ఆమనికి అవకాశం ఇవ్వలేదు.ఎన్నోసార్లు బహిరంగంగా ఆమని తనకు చిరంజీవి సినిమాలో నటించాలని ఉందని చెప్పింది. మరి ఆమని మొర విని భవిష్యత్తులో రాబోయే సినిమాలోనైనా చిరంజీవి అవకాశం ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: