
2012లో చివరిసారిగా "యమహో యమ" అనే చిత్రంలో నటించిన పార్వతి మెల్టన్. ఆ తర్వాత అమెరికాలో ఉండే ఒక బిజినెస్ మాన్ సంసులాలను వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. దీంతో సినిమాలకు దూరమైన పార్వతి మెల్టన్ సినిమాలు మానేసి బిజినెస్లు చూసుకుంటూ సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉన్నది. సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలలో అంతే గ్లామర్ గా కనిపిస్తూ అందరూ ముక్కుని వేలు వేసుకొనేలా చేస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా చేసింది.
సడన్గా బేబీ బంప్ ఫోటో షూట్లతో అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది పార్వతి మెల్టన్. కానీ తన వివాహమైన విషయాన్ని కూడా ఎప్పుడూ చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. వివాహమైన 13 ఏళ్ల తర్వాత తాను తల్లి కాబోతున్నానని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులు లైక్స్ ,కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో తిరిగి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి పార్వతి మెల్టన్.