
హైదరాబాద్‌లో లడ్డూ గణేశ్, ఖైరతాబాద్ గణేశ్, బలాపూర్ గణేశ్ వంటి ప్రసిద్ధ విగ్రహాల నిమజ్జన సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు తరచుగా దర్శనమిస్తారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాదాస్ తమ అపార్ట్మెంట్ లో ప్రతిష్ఠించిన గణేషుడి నిమజ్జన ఊరేగింపులో పాల్గొంది. ఈ క్రమంలోనే నడిరోడ్డుపై స్థానికులు, స్నేహితులతో కలిసి శ్రద్ధా ఉత్సాహంగా తీన్మార్ స్టెప్పులు వేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
వర్షం పడుతున్నా అస్సలు లెక్క చేయకుండా డాన్స్ చేసింది. అంతేకాదు స్వయంగా డ్రమ్స్ కూడా వాయించి నిమజ్జన కార్యక్రమానికి మరింత ఎనర్జీని జోడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్న శ్రద్ధా దాస్.. ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అత్యుత్తమ గణేష్ చతుర్థి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక శ్రద్ధా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. గణేశ్ నిమజ్జనంలోశ్రద్ధా డాన్స్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఆమె సింప్లిసిటీని కూడా పొగిడేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు