మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఫహద్ ఫాజిల్ ఒకరు. చాలా కాలం పాటు ఈయన కేవలం మలయాళ సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును  సంపాదించుకున్నాడు. ఫహద్ ఫాజల్ ప్రస్తుతం కేవలం మలయాళ సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 అనే సినిమాలు రూపొందిన విషయం మనకు తెలిసిందే.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పుష్ప పార్ట్ 1 , పుష్ప పార్ట్ 2 సినిమాల్లో ఈయన విలన్ పాత్రలలో నటించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయనకు ఈ సినిమాల ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఇప్పటికే ఈయన తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా నటించాడు. తాజాగా ఈయన ఓ ఖరీదైన ఫెరారీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పహద్ ఫజిల్ కొనుగోలు చేసిన కారు ధర ఏకంగా 13.75 కోట్లు అని తెలుస్తుంది.

ఇలా ఈ నటుడు తాజాగా అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పహాద్ ఫాజల్ కేవలం మలయాళ సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. ఈయన మలయాళం తర్వాత ఎక్కువ శాతం తెలుగు , తమిళ్ సినిమాల్లో నటిస్తున్నాడు. పుష్ప సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన కమల్ హాసన్ హీరో గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా ద్వారా తమిళ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: