నారా రోహిత్ 2018 వ సంవత్సరం వీర భోగ వసంత రాయలు అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించకపోయిన విమర్శకులు చేత మంచి ప్రశంసలను పొందింది. ఈ సినిమా తర్వాత చాలా కాలం పాటు నారా రోహిత్ ఏ సినిమాలో నటించలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈయన ప్రతినిధి 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక కొంత కాలం క్రితమే ఈయన భైరవం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

తాజాగా ఈయన నటించిన సుందరకాండ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి మంచి టాక్ కూడా వచ్చింది. కానీ ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.80 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి.

ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సిస్ లలో కలుపుకొని 70 లక్షల షేర్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 2.50 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా హిట్ స్టేటస్ను అందుకోవాలి అంటే నాలుగు కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయవలసి ఉంది. దానితో ఈ మూవీ మరో 1.4 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: