టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన పూరి జగన్నాథ్ గురించి కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగార్జున , పూరి జగన్నాథ్ కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటగా నాగార్జున , పూరి జగన్నాథ్ కాంబోలో శివమణి అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో సూపర్ అనే సినిమా వచ్చింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సాధించలేదు. కానీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని మాత్రం సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో మూవీ రాలేదు. ఇది ఇలా ఉంటే నాగార్జున , పూరి జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ మిస్ అయినట్టు తెలుస్తుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో గా నటించగా ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని కూడా అందుకుంది. ఇంతకు నాగర్జున , పూరి జగన్నాథ్ కాంబో లో మిస్ అయినా సినిమా ఏది అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు బద్రి.

పూరి జగన్నాథ్ "బద్రి" సినిమా కథను మొత్తం తయారు చేసుకున్న తర్వాత నాగార్జున తో ఆ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆ కథను నాగార్జున కు వినిపించాడట. కానీ నాగార్జున కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో పవన్ కళ్యాణ్ కు ఆ సినిమా కథను వినిపించగా ఆయన మాత్రం ఆ సినిమాలో నటిస్తాను అని చెప్పాడట. అలా నాగార్జున , పూరి జగన్నాథ్ కాంబో లో బద్రి సినిమా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ , పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన బద్రి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: