
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కెరీర్ ఇప్పుడే జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. సప్తసాగరాలు దాటి సినిమా తో ఒక్కసారిగా ఆమె అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేసింది. ఈ సినిమా తో ఆమె ఒక్కసారిగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాస్త అందం ఉండడంతో వరుసగా స్టార్ హీరోల సినిమా లలో అవకాశాలు వచ్చి పడ్డాయి. సక్సెస్ కంటే ఎక్కువుగా ఆమె స్క్రీన్ ప్రజెన్స్ .. ఛార్మింగ్ లుక్స్ మీద ఫిలిం మేకర్స్ ఎక్కువుగా ఇంట్రస్ట్ చూపిస్తూ అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే రుక్మిణి చేతిలో క్రేజీ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘కాంతార 1’లో కీలక పాత్ర పోషించడంతో పాటు అటు జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కే డ్రాగన్ కూడా చేస్తోంది.
ఇక కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా చేసే టాక్సిక్ సినిమా లు కూడా ఆమె లైనప్ లో ఉన్నాయి. గ్లామర్ తో పాటు క్రేజ్ కూడా పెంచేసింది. అయితే ఆమె తాజాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా హిట్ అయితే ఇది తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రుక్మిణి ఆకర్షణీయమైన లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో ఇప్పుడు ఆమె ఆశలు అన్నీ డ్రాగన్ సినిమా మీదే ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు