తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 9 ఈ నెల 7 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. బిగ్ బాస్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో మంది బిగ్ బాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కు సంబంధించిన ప్రోమోలను బిగ్ బాస్ బృందం వారు చాలా కాలం నుండి విడుదల చేస్తున్నారు. ఇక ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిందో అప్పటి నుండే బిగ్ బాస్ సీజన్ 9 లోకి వారు ఎంట్రీ ఇవ్వనున్నారు ..? వీరు ఎంట్రీ ఇవ్వనున్నారు ..? అని అనేక వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్లలో కొంత మంది జబర్దస్త్ షో కి సంబంధించిన వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జబర్దస్త్ కు సంబంధించిన అనేక మంది కమెడియన్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లోకి జబర్దస్త్ కు సంబంధించిన ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారా ..? వారు మరెవరో కాదు అను ఇమ్మాన్యూయల్ , రీతు చౌదరి. వీరిద్దరు కూడా బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అనేక రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వీరిద్దరూ ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వడానికి అంతా ఓకే అయినట్లు తెలుస్తోంది. అను ఇమాన్యుయల్ ఎక్కువ శాతం జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రీతూ చౌదరి కెరియర్ ప్రారంభంలో కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా నటించి మంచి ఫేమ్ ను సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nag