ఈ ఏడాది తెలుగు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరచగా, కొన్ని చిన్న చిత్రాలు అనూహ్య విజయాన్ని సాధించాయి. గతంలో 'హనుమాన్' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్  తెరకెక్కింది. ఈగల్ తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. తేజ సజ్జా కూడా ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటూ, సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. 'మిరాయ్' కూడా 'హనుమాన్' లాగే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇటీవల కాలంలో విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం 'మిరాయ్' వైపు చూస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆశలను, అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. 'మిరాయ్' విజయం తెలుగు సినిమా పరిశ్రమకు చాలా అవసరం. ఎందుకంటే మంచి కంటెంట్‌తో వస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించగలదు.

పీపుల్స్ మీడియా నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నారు.  పీపుల్స్ మీడియా బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది.   మిరాయ్  సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు  సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. మిరాయ్  సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.







మరింత సమాచారం తెలుసుకోండి: