
మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రేమను చూపుతూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా (డిప్యూటీ సీఎంగా) తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే సినిమాల్లో కూడా బిజీబిజీగా ముందుకు వెళ్తున్నారు. పవన్ నటించిన తాజా చిత్రం ‘ఓజి’ సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ జోష్ మధ్యలోనే ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్న మరో వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన కూడా ఒక పెద్ద స్టార్. ఆయన కుమారుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో దుమ్ము దులిపేస్తున్నాడు. ఆయన మరెవరో కాదు—రచయిత గోతి సత్యమూర్తి అలియాస్ జి. సత్యమూర్తి. జి. సత్యమూర్తి గారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి.
సత్యమూర్తి గారు 1953 మే 24న తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక ప్రతిభావంతుడు, అనుభవజ్ఞుడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన ‘దేవత’ చిత్రానికి రచయితగా పని చేశారు. ఆ తర్వాత కూడా అనేక సూపర్‌హిట్ సినిమాలకు కథలు అందించారు. ముఖ్యంగా ‘బావ మరదలు’, ‘కిరాయి కోటిగాడు’, ‘ఖైదీ నెంబర్ 786’, ‘అభిలాష’ వంటి క్లాసిక్ చిత్రాలకు ఆయన రాసిన కథలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి.
అంత ప్రతిభావంతుడైన ఈ రచయిత ఆరోగ్య సమస్యల కారణంగా 2015 డిసెంబర్ 14న చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆయన వారసత్వాన్ని తన కుమారుడు దేవిశ్రీ ప్రసాద్ ఎంతో ఘనంగా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణ భారత చిత్ర పరిశ్రమ అంతటా దేవిశ్రీ ప్రసాద్ తన ప్రత్యేకమైన సంగీతంతో అగ్రగామి మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా నిలుస్తూ దూసుకుపోతున్నారు. సినిమా రంగంలో ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఉన్న ఈ ఫోటో కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలోని ఓ అరుదైన జ్ఞాపకం. అందుకే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!