ఎట్టకేలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో 9 తెలుగు సరికొత్త సీజన్ నిన్నటి రోజున చాలా గ్రాండ్ గా మొదలయ్యింది. 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఈసారి ఊహించని మార్పులు ,ఊహించని మలుపుతో కొనసాగబోతోంది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా.. ఈ సీజన్లో సెలబ్రిటీలతో పాటుగా సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు. అలా మొత్తం మీద 15 మంది ఫైనల్ గా హౌస్ లోకి పంపారు. మరి వారు ఎవరెవరు చూద్దాం. ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ గురించి చెప్పిన విషయాలను చూద్దాం.


1). బుల్లితెర నటి తనూజ పుట్ట స్వామి:
ఈమె ముద్దమందారం సీరియల్ లో నటించింది.. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా తనూజ మాట్లాడుతూ.. తాను ఫ్యామిలీ గర్ల్, ఓవర్ థింకర్, మూడీ, సెన్సిటివ్, క్రేజీ అందంగా ఉంటానంటూ తెలుపుతూ.. తనకి వంట బాగా వచ్చని తాను అనుకున్న పనిని మధ్యలో వదిలేయడం అంటూ తెలిపింది.


2). ఆశా సైని:
ఒకప్పుడు హీరోయిన్ ఈమె అసలు పేరు ఆశ సైని కాగా ఫ్లోరాసైని అని మార్చుకుంది. ఈమె నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్   వంటి చిత్రాలలో నటించింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత తనకు ఈ అవకాశం వచ్చిందని తనను తాను నిరూపించుకుంటాను అంటూ తెలిపింది.

3). జవాన్ కళ్యాణ్ (ఫస్ట్ కామనర్)
ఇద్దరు సెలబ్రిటీలు హౌస్ లోకి వచ్చాక మూడో కంటెంట్గా ఒక కామన్ మ్యాన్ ని ఎంట్రీ ఇచ్చారు.. జవాన్ కళ్యాణ్ అనేవారు సోల్జర్.

4). జబర్దస్త్ ఇమ్మాన్యుయల్:
నాలుగో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ కమెడియన్ జబర్దస్త్ ద్వారా బాగా క్లారిటీ సంపాదించారు. అదే వినోదాన్ని జబర్దస్త్ లో కూడా పంచుతానని తెలిపారు.


5). శ్రష్ట వర్మ:
5వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రష్ట వర్మ.. లేడీ కొరియోగ్రాఫర్ గా ఉన్నది. ఢీ షో ద్వారా పాపులారిటీ సంపాదించిన ఈమె జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసింది.. జానీ మాస్టర్ వివాదం వల్లే భారీ పాపులారిటీ సంపాదించింది. తనకు హౌస్ లోకి అడుగుపెట్టడం అంటే చాలా ఇష్టం తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ తో ఉంటారని కేవలం హౌస్ లో మాత్రమే అసలు నిజం స్వరూపం తెలుస్తుందని తెలిపింది.


6). మాస్క్ మ్యాన్ (కామనర్):
ఆరో కంటిస్టెంట్ గా కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చారు. ఈయన అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్ బిందు మాధవి ఎంపిక చేశారు.


7). భరణి:
ఈయన టీవీ నటుడు పలు సినిమాలలో విలన్ గా కూడా నటించారు.


8). రీతూ చౌదరి:
8వ కంటిస్టెంట్ గా అడుగుపెట్టిన రీతూ చౌదరి జబర్దస్త్ తో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. ఇమే అసలు పేరు దివ్య అని రివిల్ చేసింది. తన పేరు మార్చుకోవడం వెనక విషయాన్ని చెప్పలేదు.

9). డియోనో పవన్ (కామనర్)
9వ కంటెస్టెంట్ గా ఏంట్రీ ఇచ్చిన ఈయన స్వయంగా నాగార్జున ఎంపిక చేశారు.

10). సంజన గల్రానీ:
పదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ హీరోయిన్ పలు చిత్రాలలో కూడా నటించింది. తాను నటించిన సినిమాలు గురించి మాట్లాడకుండా తాను చిక్కుకున్న కేసు గురించి మాట్లాడడం బాధగా ఉందంటూ తెలిపింది. తన భర్త కూడా డాక్టర్ అని తెలిపింది.

11). రాము రాథోడ్:
11వ కంటెస్టెంట్ గా ఫోక్ సాంగ్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు."రాను బొంబాయి కి రాను" పాటతో భారీ పాపులారిటీ సంపాదించారు.

12). శ్రీజ దమ్ము (కామనర్)
కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీజ దమ్ము జ్యురీ జడ్జిమెంట్ కింద హీరో నవదీప్ ఎంపిక చేశారు.


13). సుమన్ శెట్టి:
ఒకప్పుడు కమెడియన్ గా పేరు సంపాదించిన సుమన్ శెట్టి 300కు పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. హౌస్ లో నిజాయితీగా గేమ్ ఆడి మీ చేతుల మీదే తప్పు గెలుచుకుంటానంటూ నాగార్జునకు చెప్పారు.


14). ప్రియా శెట్టి (కామనర్ )

ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ప్రియా ముందంజలో ఉండడంతో హౌస్ లోకి తీసుకున్నారు ఈమె ఒక డాక్టర్.

15). మర్యాద మనీశ్:
శ్రీముఖి రిక్వెస్ట్ మేరకు నాగార్జున కామనర్స్ నుంచి ఈ కంటెంట్ ని హౌస్ లోకి పంపారు.


ఈసారి హౌస్ లో రెండు ఇల్లుగా డిజైన్ చేశారు.. మైన్ హౌస్ లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అవుట్ హౌస్ లో అలాంటివేవీ ఉండవు.. అగ్నిపరీక్షలో సత్తా చాటిన వారు మెయిన్ హౌస్ లో ఉంటారని సెలబ్రిటీలు అవుట్ హౌస్ లో ఉంటారంటు నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: