బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ షోను అట్టహాసంగా లాంచ్‌ చేశారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. వీరిలో 9 మంది సినీ, బుల్లితెర ప్రముఖులు ఉన్నారు. వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏకంగా ఆరుగురు సామాన్యులను రంగంలోకి దింపారు. అయితే సామాన్యుల కేటగిరీలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది దమ్ము శ్రీజ.


అగ్నిపరీక్ష ప్రోగ్రాంలో అందరినీ ఈ అమ్మడు దడ దడ లాడించింది. నిజానికి మొదట జడ్జిల్లో అభిజిత్, బిందు మాధవి ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇస్తూ బిగ్ బాస్ షోకు స‌రైన‌ కంటెస్టెంట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా కూడా అధైర్య పడకుండా తన మాటలతో మరొక జ‌డ్జ్ న‌వ‌దీప్‌ను మెప్పించి గ్రీన్ ఫ్లాగ్ ను సొంతం చేసుకుంది. అలా వచ్చిన చిన్న అవకాశంతో శ్రీజ తన సత్తా ఏంటో నిరూపించుకుంది. టాస్కుల్లో అదరగొట్టి టాప్ లో నిలిచింది. తన పేరులో ఉన్న ద‌మ్ము త‌న మాటల్లోనే కాదు తనలో కూడా ఉందని నిరూపించుకుంది. ఫైనల్ గా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో శ్రీజ దమ్ము గురించి మరికొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెర‌పైకి వచ్చాయి.


ఈ బ్యూటీది విశాఖపట్టణం. శ్రీ‌జ తండ్రి ద‌మ్ము శ్రీ‌ను జీవీఎంసీ ఉద్యోగి. ఆమె సోద‌రుడు కూడా జీవీఎంసీలోనే ప‌ని చేస్తాడు. వీరిది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ.  ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసి శ్రీ‌జ‌.. బిగ్ బాస్‌కు రాక‌ముందు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి కంపెనీల్లో పని చేసింది. నెల‌కు జీతం ల‌క్ష‌న్న‌ర పైమాటే. అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ పెర‌గ‌డంతో ఇన్ఫ్లుయెన్సర్ గానూ మారింది. అయితే క‌ళ్లు చెదిరే జీతం, సాఫ్ట్‌వేర్ జాబ్ వ‌దిలేసి త‌న‌ను తానే ఇంకా ఏదో ఫ్రూవ్ చేసుకునేందుకు శ్రీ‌జ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. మ‌రి ఈ చిన్న‌ది ఏ విధంగా గేమ్ ఆడుతుంది? హౌస్‌లో మిగతా కంటెస్టెంట్ల మ‌ధ్య ఎలా నెగ్గుకొస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: