జయప్రద.. అందానికి నిలువెత్తు రూపంg ఉండే ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది సీనియర్ హీరోలతో జత కట్టింది. అలా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణలతో ఈ హీరోయిన్ పదుల కొద్ది సినిమాల్లో నటించింది. అయితే అలాంటి జయప్రద కేవలం సినిమాల్లో రాణించడమే కాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది. ఇక మొదట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది టిడిపి పార్టీ ద్వారానే.. అలా సీనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతో టిడిపి లోకి ఎంట్రీ ఇచ్చిన జయప్రద పై అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. ఆయన గతంలో ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అందరి జీవితాల్ని నాశనం చేశాడు.

 ఆయనకి జీవితాలని నాశనం చేయడం కొత్తేమీ కాదు..ఆయన జయప్రద జీవితాన్ని కూడా నాశనం చేశాడు.. పార్టీలో ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆయన ఎదగనివ్వరు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే అప్పట్లో పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్లు మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. అయితే ప్రస్తుతం మరోసారి పోసాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం రీసెంట్ గా సోనీ లైవ్ ఓటిటి లో వచ్చిన మయసభ మూవీ.. అయితే ఈ సినిమా లో చంద్రబాబు  రాజకీయాల్లోకి రాకముందు ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించినట్టు చూపించారు.

అయితే ఈ సినిమా వచ్చాక రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు నాయుడు ప్రేమ లో పడింది జయప్రదతోనే అంటూ చాలామంది ఈ విషయాన్ని వైరల్ చేశారు. అంతే కాదు కొంతమంది నెటిజన్స్ అయితే ఏకంగా చంద్రబాబు, జయప్రద లవ్ అన్నట్లుగా ఇద్దరి ఫోటోలతో పోస్టులు కూడా చేశారు.అలా ఈ సోషల్ మీడియా రూమర్ల కు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. దాంతో ఈ విషయం మళ్లీ నెట్టింట్లో లో వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: