
ఎవరైనా “కాస్టింగ్ కౌచ్‌కి బలయ్యాం” అని నిజాయితీగా ఒప్పుకుంటే, వారికి అవకాశాలు రావు, గడిచిన పేరు పోతుంది, కెరీర్ దెబ్బతింటుందని భయంతో చాలా మంది నోరు మూసుకుంటున్నారు. తమ పాపులారిటీ కోసం, తమ కలల కోసం అన్ని బాధలను మౌనంగా భరిస్తున్నారు. అయితే, అందరూ అలాంటివారు కాదు. కొంతమంది మాత్రం ధైర్యంగా, బోల్డ్‌గా మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా, ఇటీవల ఒక స్టార్ యాంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకప్పుడు టాప్ యాంకర్‌గా వెలుగొందిన ఆమె, పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఆమె స్పష్టంగా మాట్లాడుతూ.."కాస్టింగ్ కౌచ్ అనేది కొన్నిసార్లు మన ఇష్టంతో జరుగుతుంది, కొన్నిసార్లు మన ఇష్టం లేకుండానే జరుగుతుంది. కానీ మనకు కావలసినది ఏమిటో క్లారిటీగా ఉంటే, ఆత్మవిశ్వాసంగా అడగగలిగితే, ఎలాంటి ఇబ్బందులు రావు. కాస్టింగ్ కౌచ్ అనేది మనల్ని మనమే బలహీనంగా చేసుకుంటేనే సమస్య అవుతుంది. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గిల్లితే గిల్లించుకోవాలి అనేది ట్రెండ్ అయితే, ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. గిల్లకపోయినా అడిగిమరీ గిల్లించుకుంటున్నారు, పిసికిచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేశాయి. మేము ఉన్న కాలం కంటే ఇప్పటి పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి.” అని బోల్డ్‌గా సమాధానమిచ్చింది.
ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో జరుగుతున్న వాస్తవాలను ఎలాంటి భయం లేకుండా చెప్పినందుకు కొంతమంది ప్రశంసిస్తుంటే, మరికొంతమంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఈ యాంకర్ మాట్లాడిన బోల్డ్ స్టేట్మెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.