
అయితే కర్ణాటకలో టికెట్ రేట్లను గరిష్టంగా రూ. 200కి పరిమితం చేయాలని హోంబాలే ఫిలిమ్స్ కోర్టును ఆశ్రయించడం కొత్త వివాదానికి దారితీసింది. ఫిలిం ఛాంబర్ దీనికి వ్యతిరేకంగా నిలబడటంతో, తీర్పు అనుకూలంగా రాకపోతే నిర్మాతలు ఏం చేస్తారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. రిషబ్ శెట్టి మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఫైనల్ టచ్‌లతో బిజీగా ఉండి, పబ్లిసిటీ లేకపోయినా సినిమా భారీ ఓపెనింగ్స్ తేవడంలో ఎలాంటి సందేహం లేదని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నాడట. కానీ మార్కెట్ రేంజ్, బిజినెస్ లెక్కలు చూస్తే మాత్రం ఈసారి ప్రోమోషన్ తప్పనిసరి అని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులకు నిర్మాతలు వంద కోట్ల వరకు డిమాండ్ చేసినా, చివరికి డీల్ సుమారు 70 కోట్ల వద్ద క్లోజ్ అయినట్టే ఇన్ సైడ్ టాక్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఈ హక్కులు సొంతం చేసుకున్నా, అసలు ఫిగర్ బయటకు రాలేదు. ఇక సోమవారం రిలీజ్ కాబోయే ట్రైలర్ సినిమాకు గేమ్ చెంజర్ కావొచ్చు. ట్రైలర్ బ్లాస్ట్ అయితే “కాంతార చాప్టర్ 1” మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం. కానీ ఇంత నిమ్మళంగా ఉంటే, బలమైన పోటీలతో రానున్న ఈ దసరా సీజన్ లో రిస్క్ తప్పదని ఫిలిం నిపుణులు అంటున్నారు. కాంతార మొదటి భాగం హిస్టారికల్ బ్లాక్‌బస్టర్ అయినా, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఓజీ లాంటి మాస్ మాన్స్టర్, ఇడ్లీ కడాయి లాంటి ఎమోషనల్ డ్రామా ఎదుర్కోవాల్సి ఉండటంతో రిషబ్ శెట్టికి ఈ సారి గట్టి ఎగ్జామ్ లాంటిదే.