
మనందరికీ తెలిసిందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన "ఓజీ" సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 24 రాత్రి 9:40కి ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఏ వార్త, ఏ అప్డేట్ వచ్చినా అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓజీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ అది పూర్తిగా సిద్ధం కాకముందే విడుదలైంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే, డైరెక్టర్ సుజిత్ అనుకున్న విధంగా పూర్తి ట్రైలర్‌ను ఫిక్స్ చేసి మరోసారి రిలీజ్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ మళ్లీ బాగా రన్నింగ్‌లోకి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మరింత హైలైట్ అవుతోంది. ఆయన చెప్పిన డైలాగ్స్, చేసిన పర్ఫార్మెన్స్, ముఖ్యంగా హై యాక్షన్ సీన్స్ – ఫైర్‌లో కత్తి పట్టుకొని చూపించే సీన్స్ – హైలైట్‌గా మారాయి. ప్రత్యేకంగా ట్రైలర్ ఎండింగ్‌లో ఆయన ఘాటుగా చెప్పిన “నా కొడకల్లారా..” డైలాగ్, వెంటనే గన్ ఫైరింగ్ సీన్ – చాలా ఇంప్రెసివ్‌గా అనిపించాయి.
అయితే ఈ ఓజీ ట్రైలర్ చూసిన వాళ్లంతా గతంలో పవన్ కళ్యాణ్ నటించిన "పంజా" సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఇంచుమించు పంజాలో కూడా ఇలానే గన్ కల్చర్‌తో పవన్ కళ్యాణ్ కనిపించాడు. కానీ ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. “అది ఆయన ఇమేజ్‌కి తగిన మూవీ కాదు” అంటూ అప్పట్లో ట్రోల్స్ చేశారు జనాలు.ఇప్పుడు ఓజీ న్యూ ట్రైలర్ పుణ్యమంటూ, మరొకసారి సోషల్ మీడియాలో "పంజా" సినిమా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. చూడాలి మరి, ఈసారి ఓజీ సినిమా పవన్ అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో..? ఫస్ట్ డే ఏ స్థాయి కలెక్షన్లు సాధిస్తుంది అనేది..??