ఒకానొక సమయంలో పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు . వాటికి వీటికి అస్సలు పొంతనే ఉండేది కాదు . కానీ ప్రస్తుతం అలా లేదు . పాలిటిక్స్ లో ఉన్నవారు సినిమాల్లో కూడా ఉండటం వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు అనేక రకాల కామెంట్స్ చేయడం చాలా కామన్ గా మారిపోయాయి . సినిమా రంగం పొలిటికల్ రంగం ఒకటిగా చేయి కలిపినట్టు మారింది . ఇక తాజాగా డిప్యూటీ సీఎం గా పదవు పొంది తనదైన రీతిలో అభిమానులను సంపాదించుకుంటున్న పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే . సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా ఓజి మూవీ రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే పవన్ అంటే గిట్టని ప్రత్యక్ష పార్టీల నేతలు ఈ సినిమాపై బురద జల్లేందుకు చూస్తున్నాయి . ఇందులో మొదటి వ్యక్తి రోజా .


వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యేగా నిలబడి దారుణంగా ఓడిపోయిన రోజా పవన్ పై పీకల్లోతున పగతో ఉంది . ఈ క్రమంలోనే ఓజీ మూవీ పై నిప్పులు చెరిగింది రోజా . రోజా కూడా సినీ ఇండస్ట్రీకి చెందినదే అన్న విషయం మనందరికీ తెలిసిందే . కానీ తన చేస్తే ఒప్పు ఎదుటోళ్ళు చేస్తే తప్పు అనే విధంగా రోజా తాజాగా కామెంట్స్ చేయడం పవన్ ఫ్యాన్స్ కి చిర్రెత్తించినట్లు అయ్యింది . మీడియాతో రోజా మాట్లాడుతూ.." నా ఓజీ కి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్టు . మీరు ఎక్కడ సచ్చినా నాకు అనవసరమని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు .


ఒక రైతు సూసైడ్ చేసుకుంటే.. ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధరలు రాలేదని ఏడుస్తుంటే.. వారికి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దానిని పక్కన పెట్టి.. కేవలం హర హర వీరమణులు టికెట్ల ధరలు పెంచుకోవడానికి మరియు ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈరోజు షూటింగ్ లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. ప్రజరిచ్చిన ఆ పదవిని దుర్వినియోగం చేస్తూ.. ఈరోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. ప్రజల్ని గాలికి వదిలేసి తన ఇష్టాచారంగా ప్రవర్తిస్తున్నాడు " అంటూ రోజా పవన్ పై మండిపడింది . ప్రెసెంట్ రోజా కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి . మరి రోజా వ్యాఖ్యల వల్ల ఓజీపై ఏమన్నా నెగిటివ్ ప్రభావం పడనుందేమో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: