పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా  నిన్నటి రోజున భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా డైరెక్టర్ సుజిత్ చూపించారు. ఇమ్రాన్ హస్మిన్ విలనిజం, పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన, లుక్స్, బిజిఎం అన్నీ కూడా ఓజి సినిమాకి బాగా కలిసొచ్చాయి. థియేటర్లో అభిమానులు ఓజి సినిమా చూస్తూ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హైప్ చూసి మొదటిరోజు ఓజి సినిమా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూశారు.


తాజాగా ట్రేడ్ అనలిస్ట్ sacnilk తెలిపిన ప్రకారం ప్రీమియర్స్ (20.25 కోట్లు) తో కలుపుకొని ఇండియాలో  రూ.90 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబడినట్లు తెలియజేసింది. ఇక తెలుగులో ఒక్కటే 69.35% వరకు ఆక్యుపెన్సి నమోదైనట్లు తెలుస్తోంది.అలాగే తమిళంలో 18.36%, హిందీలో 10.37% ఆక్యుపెన్సీ నమోదైనట్లుగా తెలియజేశారు.  ఆల్ టైం ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్గా ఓజి సినిమా నిలిచినట్లు చిత్ర బృందం తెలియజేసింది.


సుమారుగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఓజి  చిత్రంతోనే దొరికింది. ప్రస్తుతం దసరా సెలవులు కావడం చేత భారీగానే కలెక్షన్స్ రాబట్టేలా కనిపిస్తోంది ఓజి మూవీ. ఈ చిత్రానికి సంబంధించి A సర్టిఫికెట్ సెన్సార్ బోర్డ్ జారీ చేయడంతో ఫ్యామిలీతో వెళ్లలేని పరిస్థితి ఉంది. దీనివల్ల  కలెక్షన్స్  పై ప్రభావం పడుతుంది అనుకున్నప్పటికీ భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు భారీ కలెక్షన్స్ తో దూసుకుపోయిన ఓజి సినిమా ఫైనల్ గా ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి మరి. పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక మోహన్ నటించగా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: