పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అంటే ఆయన అభిమానులు మిస్ అవుతారా? ఎంత ఎగ్జామ్ ప్రెజర్ ఉన్నా..? ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా..? ఫస్ట్ డే ఫస్ట్ షో అయినా కచ్చితంగా చూసేందుకు ట్రై చేస్తారు. అది కుదరకపోతే ఏదో ఒక రోజు థియేటర్‌ కి వెళ్లి సినిమా చూడటం మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్యాన్స్‌కి కేవలం సినిమా అనిపించవు, ఒక ఎమోషన్, ఒక ఫెస్టివల్ లాంటి ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఒక న్యూస్ మాత్రం అభిమానుల్లో కొత్త సందేహాలు రేపుతోంది. పవన్ కళ్యాణ్‌కి అత్యంత దగ్గర స్నేహితుడు, ఆయన రైట్ హ్యాండ్‌గా ఇండస్ట్రీలో పిలవబడే టాప్ సెలబ్రిటీ అయిన జాన్ జిగిడి దోస్త్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తాజా బ్లాక్ బస్టర్ "ఓజి" సినిమాను చూడలేదని సమాచారం బయటకు వచ్చింది.


సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ లేటెస్ట్ బిగ్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ "ఓజి" . ఇప్పటికే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. హై లెవెల్ వైలెన్స్, పవర్‌ఫుల్ ఎలివేషన్స్, థమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి అదనపు రేంజ్ తెచ్చిపెట్టాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మాస్ ఆడియన్స్ వరకు అందరూ థియేటర్స్‌లో క్యూలు కడుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రముఖులు దాదాపు అందరూ సినిమా చూసేశారు. రీసెంట్‌గా అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వెళ్లి "ఓజి" చూశారు, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది.



అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్‌కి స్నేహితుడు, అతని క్లోజ్ సర్కిల్‌లో ఉండే జాన్ జిగిడి మాత్రం సినిమా చూడకపోవడం అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. పవన్ కళ్యాణ్‌కి అంత దగ్గరగా ఉండే వ్యక్తి ఈ సినిమా చూడకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా? వీరిద్దరి మధ్య ఏదైనా తేడా ఏర్పడిందా? లేక అందుకే ఆయన "ఓజి" ప్రమోషన్స్‌కి కూడా దూరంగా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆయన అభిమానులు మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలోని అందరూ మిస్ కాకుండా చూడటమే ట్రెడిషన్‌గా మారింది. అలాంటి సమయంలో జాన్ జిగిడి లాంటి అతనికి అత్యంత దగ్గర వ్యక్తి ఈ సినిమాను దూరంగా ఉంచుకోవడం నిజంగానే పెద్ద డౌట్స్ కి దారి తీస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: