ప్రముఖ నటుడు మరియు డాన్సర్ అయినటువంటి రామ్ చరణ్ మనందరికీ సుపరిచితమే . ఎన్నో చిత్రాల్లో తనదైన నటనను నిరూపించుకుని టాలీవుడ్ లో తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు చెర్రీ . ఇండస్ట్రీకి చిరు కొడుకుగా అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతం చిరును మించిన రేంజ్ లో ఉన్నాడు . వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చెర్రీ . రామ్ చరణ్ సతీమణి మరియు బిజినెస్ వుమెన్ ఉపాసన తాజాగా బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతి చాటింది .


తెలంగాణ పండగను దేశ రాజధానిలో సీఎం రేఖ గుప్త మరియు తెలుగు విద్యార్థులతో కలిసి ఉపాసన బతుకమ్మని ఆడారు . ఢిల్లీలోని తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో రంజాస్ కళాశాలలో శనివారం బతుకమ్మ వేడుకలువు నిర్వహించారు . ఈ  వేడుకకు ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం రేఖ గుప్తా మరియు ఉపాసన హాజరై సందడి చేయడం జరిగింది . ఢిల్లీ సీఎం మరియు స్టూడెంట్స్ తో కలిసి ఉపాసన బతుకమ్మ ఆడారు . ఈ మేరకు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఆదివారం ఫోటోలను మరియు వీడియోలను షేర్ చేసింది .


ఈ సందర్భంగా రంజాస్ కాలేజ్ విద్యార్థులకు మరియు సీఎం రేఖ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపింది . ఈ పండగ కాలంలో మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న దేవిని సత్కరించుకొని మన బలాన్ని కలిపి జరుపుకుందాం ... అని ఉపాసన పేరుకుంది . రేఖ గుప్తా జి మీరు ఒక అద్భుతమైన సీఎం... తెలంగాణ సంస్కృతిని ఆప్యాయతంగా ఆహ్వానించి బతుకమ్మ పండుగను మాతో కలిపి జరుపుకున్నందుకు కృతజ్ఞతలు .‌.. అంటూ తన ట్వీట్లో పేరుకుంది ఉపాసన . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: