యంగ్ టైగర్ గా గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 . గ్రీడ్ గాడ్ హృతిక్  రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా నిర్మించింది . ఈ చిత్రంకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు . బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇంతటి భారీ కాంబోలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది .


మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు . బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా కావడంతో  భారీ హీట్ కొడుతుందని భావించారు . కానీ వారి నమ్మకాలను ఒమ్ము చేసిందని చెప్పుకోవచ్చు . ఇద్దరూ మాస్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమాను పేలవంతమైన డైరెక్షన్తో నిర్వహించుకోకపోవడం వలన ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది . భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ దక్కించుకుంది . ఇటు తెలుగులోనూ ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది .


ఫైనల్ రన్ లో 450 కోట్ల మేరా కలెక్షన్స్ రాబట్టింది . కాగా ప్రెసెంట్ ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది ‌. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్ అక్టోబర్ 9న స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తుంది . థియేటర్లో రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ . తెలుగు మరియు తమిళ్ అదేవిధంగా హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నారు . మరి ఓటిటిలో ఎంత మేరా రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: