విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీస్ ఏవి ..? అందులో తెలుగు సినిమాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 285.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 215 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. 

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందిన కల్కి 2898 AD సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 167 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 

 యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 164.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. 

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 157 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 

రజనీ కాంత్ హీరోగా రూపొందిన కూలీ మూవీ కి 151.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

విజయ్ హీరోగా రూపొందిన లియో మూవీ కి 146.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి మూవీ కి 145 కోట్ల కలెక్షన్లు దక్కాయి. 

ఇక మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సౌత్ మూవీలలో 7 సినిమాలు తెలుగువే ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: