
ప్రస్తుతం చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ పండక్కి వచ్చేస్తున్నారు’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ మాస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి కుటుంబ వినోదభరిత చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్ పాత్రలో మరో ప్రముఖ నటి క్యాధరిన్ కనిపించబోతుందనే టాక్ ఫిలింసర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట చూసిన అభిమానులు — “ఇదే అనిల్ రావిపూడి టచ్!” అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఒక్క పాటతోనే సినిమా హిట్ రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోందని ట్రేడ్ టాక్.
ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ కోసం చిరంజీవి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఈ పాటలో ఉండే హార్డ్ స్టెప్స్‌ని ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇంత వయసులోనూ ఇంత రిస్కీ స్టెప్స్ చేయడం చిరంజీవికే సాధ్యం అంటున్నారు సినీ ప్రముఖులు. ఫ్యాన్స్ అయితే ఈ డెసిషన్‌పై ఫుల్ హ్యాపీగా ఉన్నారు. “మన మెగాస్టార్ ఇంత వయసులో కూడా ఈ రేంజ్‌లో ప్రిపేర్ అవుతుంటే యంగ్ హీరోలు సిగ్గుపడాలి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోసారి చిరంజీవి తన డెడికేషన్‌తో ప్రూవ్ చేశాడు — మెగాస్టార్ అంటే ఎందుకు మెగాస్టారనే విషయం!
అందుకే ఆయన పేరు చెప్పగానే ఇండస్ట్రీ గర్వపడుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఊరికే ఆ స్థాయికి వెళ్లలేదు. ప్రతి సినిమా, ప్రతి సీన్, ప్రతి స్టెప్ ఆయన కష్టానికి నిదర్శనం. ఇప్పుడు ఈ కొత్త సాంగ్‌తో మరొకసారి చిరంజీవి డాన్స్ ఫ్లోర్‌ను ఊపేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతూ హ్యాష్‌ట్యాగ్ #MegastarChiranjeevi #PandakkiVachesthunnaru #MassStepBlast లతో ట్రెండ్ అవుతోంది. నిజంగా, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే, ఎనర్జీ అంటే చిరంజీవి అని మరోసారి ప్రూవ్ చేయబోతున్నాడు మన మెగాస్టార్!