సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవారిని గుర్తించడంలో స్టార్ హీరోలు వేరే లెవల్ లో ఉంటారు. అలాంటి రేంజ్ డైరెక్టర్లలో ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..? అదే మన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌, కమర్షియల్ ఎలిమెంట్స్‌ అన్ని ఉంటాయి. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను నవ్విస్తూ, హిట్‌లు కొడుతూ అనిల్ తనకంటూ ఒక ప్రత్యేక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఆయన డైరెక్షన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ – పండక్కి వచ్చేస్తున్నాడు అనే సినిమాను మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కిస్తున్నారు.


సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు జనాలు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందనే పాజిటివ్ టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ జోష్‌లోనే ఇప్పుడు అనిల్ రావిపూడికి సంబంధించిన మరో సంచలన న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తల ప్రకారం — కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కుమార్, అనిల్ రావిపూడి సినిమాలు చూసి బాగా ఇంప్రెస్ అయ్యారట. ఆయన దర్శకత్వ శైలి, హ్యూమర్ టైమింగ్‌, స్ర్కీన్‌ప్లే నచ్చి, అజిత్ స్వయంగా అనిల్ రావిపూడిని తన ఇంటికే పిలిచి చర్చలు జరిపారట. అంతేకాదు, ఒక కొత్త సినిమా కోసం ఆఫర్ కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



ఇంత పెద్ద స్థాయిలో తమిళ స్టార్ హీరో ఇంటికే పిలిచి ఆఫర్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. అందుకే ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు సోషల్ మీడియాలో “ఇది నిజమే అయితే అనిల్ రావిపూడి కెరీర్‌లో ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది”, “అజిత్ అండ్ అనిల్ కాంబినేషన్ అంటే పక్కా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, అజిత్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ గానే ఉండగా, ఈసారి మాత్రం ఫుల్ ఎంటర్‌టైనింగ్ స్టోరీ కావాలని భావిస్తున్నారట. ఆ రేంజ్‌లో సరిపడే డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరే ఆయన మైండ్‌లోకి వచ్చిందట.



అనిల్ రావిపూడి ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. హిట్ రికార్డ్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర కూడా ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అజిత్‌ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే, అది అనిల్ కెరీర్‌కి ఓ జాక్పాట్ లాంటిదే. ఇండస్ట్రీలో చాలా మంది ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుందన్న బజ్ వినిపిస్తోంది. ఇప్పుడంతా ఒకటే ప్రశ్న —“అనిల్ రావిపూడి ఈ వార్తపై ఎప్పుడు స్పందిస్తారు? నిజంగానే అజిత్‌తో సినిమా చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇది నిజమైతే  టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్‌కి వెళ్ళబోతున్న మరో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ ఫిక్స్ అని చెప్పొచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: