
ఇందులో అల్లు అర్జున్ గెటప్ పూర్తిగా కొత్తగా, స్టైలిష్‌గా ఉండనుందట. ప్రత్యేకంగా రూపొందించిన ఈ సన్నివేశాల్లో బన్నీ యాక్షన్ మేనరిజం, స్టంట్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేలా ఉంటాయట. అట్లీ సౌత్ ఇండియన్ మాస్ కమర్షియల్ స్టైల్‌ను, అల్లు అర్జున్ ఎనర్జీని కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమా కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆసక్తికరమైన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. బన్నీ పాత్రలో అనేక వేరియేషన్స్ ఉండనున్నాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో కీలకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆ ఎపిసోడ్‌లోని యాక్షన్ సీన్స్ అద్భుతమైన ఎమోషన్‌తో ఉండబోతున్నాయట.
సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సంగీతం, సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ హై ఎండ్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఉండనున్నాయి. అంతేకాక అట్లీ ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక గెస్ట్ రోల్స్‌ను డిజైన్ చేస్తున్నాడట. ఆ పాత్రలకు ప్రముఖ నటులను తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మొత్తంగా ఈ అట్లీ–అల్లు అర్జున్ కాంబో సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా భారత సినిమా ప్రపంచంలోనే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.